కలం, వెబ్డెస్క్: పొగమంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 (Ind vs SA 4th T20) రద్దయ్యింది. బుధవారం లక్నో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ కూడా వేయకుండానే రద్దుచేశారు. పొగమంచు కారణంగా ఆటగాళ్లు డ్రస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. ఆటను కొనసాగించేందుకు పలుసార్లు అంపైర్లు పరిశీలించినా సాధ్యపడలేదు. చివరకు రాత్రి 9.30కు మరోసారి పరిశీలించాక ఆటను రద్దు చేస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ, అంపైర్లు ప్రకటించారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం భారత్ 2–1 ఆధిక్యంలో ఉంది. చివరి టీ20 అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 19న జరగనుంది.
Read Also: సచిన్ను కలసిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు
Follow Us On: X(Twitter)


