Women World Cup | ఈ ప్రశ్నకు దాదాపు అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ క్రికెట్‌లో పెరుగుతున్న ఇండియా ఆధిపత్యం పాక్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. మొన్నటి వరకు ఆసియా కప్-2025లో భాగంగా పాకిస్థాన్ పురుషుల జట్టును టీమిండియా పురుషుల జట్టు ఉతికారేసింది. ఈ రెండు జట్ల మధ్య ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లు జరిగితే మూడిట్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా పాక్‌ను చిత్తు చేయడమే కాకుండా.. పాక్ మంత్రి ఇచ్చే ట్రోఫీకి నో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మహిళల క్రికెట్‌లో కూడా భారత జట్టు పాకిస్థాన్‌ను రఫ్ఫాడిస్తోంది. దౌత్యపరంగా ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న విభేదాలు.. క్రికెట్‌పై కూడా ప్రభావం చూపుతుంది.
అందుకు ఆసియా కప్-2025 మెన్స్ ట్రోఫీలో కప్ తీసుకోవడానికి ఇండియన్ ప్లేయర్స్ నో చెప్పడం ఒక ఉదాహరణ అయితే. ఇప్పుడు మహిళల క్రికెట్‌లో కూడా అటువంటి వైఖరే కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్(Women World Cup)లో భాగంగా ఇండియా, పాక్ తలపడ్డాయి. అందులో పాక్‌ను ఇండియా మహిళల జట్టు చిత్తు చేసింది. అంతేకాదండోయ్.. అచ్చం పురుషుల జట్టు తరహాలోనే గెలిచిన తర్వాత పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మహిళా ప్లేయర్లు వచ్చేశారు. దీంతో భారత్ ఒత్తిడి పాక్‌పై భారీగా ఉందని, క్రికెట్‌లో దాయాది గెలిచే సత్తా పాక్‌కు పోయిందని కూడా కొందరు అంటున్నారు. క్రికెట్‌లో ఇండియా ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతుండటంతో పాక్ పనైపోయిందన్న వాదన బలం పుంజుకుంటుంది. ప్రస్తుతం పాక్ తన ఆధిపత్యాన్ని పసికూన దేశాల జట్లపైనే కనబరచగలుగుతుందని చురకలంటిస్తున్నవారు కూడా ఉన్నారు.
మహిళల క్రికెట్‌లో టీమిండియాను ఓడించడం అనేది పాక్‌కు ఓ పెద్ద కల అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు భారత్, పాక్ మధ్య 11 వన్డేలు జరిగితే అన్నింటిలో కూడా భారత్ విజయం సాధించింది. అంతేకాకుండా.. పాక్ గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది. భారత బ్యాటర్ల దెబ్బకి పాక్ బౌలర్లు చుక్కలు చూస్తే. పాక్ బ్యాటర్ల చేత భారత బౌలర్ల కూడా మూడు చెరువుల నీళ్లుతాపించారు. అందుకే పాక్ పనైపోయిందన్న వాదన ప్రస్తుతం చాలా బలంగా వినిపిస్తోంది.

