Mobile Popup Ad
Mobile Popup Ad

వీసా ఉంటేనే లోన్: ఐటీ ఉద్యోగులకు ట్రంప్ షాక్!

కలం, వెబ్‌ డెస్క్ : అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న ఐటీ ఉద్యోగులకు, ఉన్నత చదువులు చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. బ్యాంకింగ్ వ్యవస్థలో వలసదారుల స్టేటస్‌ను ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ తాజా నిర్ణయం ప్రకారం అమెరికాలోని బ్యాంకులు హెచ్ వన్ బీ వీసా హోల్డర్లు, ఓపీటీ విద్యార్థుల ఖాతాలపై ప్రత్యేక నిఘా ఉంచనున్నాయి.

ముఖ్యంగా వలసదారులు ఎవరైనా హోమ్ లోన్ లేదా ఇతర రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారి వీసా గడువును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ట్రంప్ ఆదేశించారు. వీసా కాలపరిమితి ఆధారంగా లోన్లు ఇవ్వాలా వద్దా అనేది బ్యాంకులు నిర్ణయించాల్సి ఉంటుంది. ట్రంప్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై వలసదారుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆర్డర్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటామని, కోర్టుల్లో పోరాటం చేస్తామని వివిధ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>