కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద (Nerella Sharada) హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీ (Koti Womens College) ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలేజీలో సినిమా షూటింగ్‌ల సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థినులను వేధిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆమె కళాశాలకు వచ్చారు. ఈ సందర్భంగా శారద విద్యార్థినులతో మాట్లాడి, వారి సమస్యలను విన్నారు.
ఎలాంటి వేధింపులూ లేవు..
కోఠి ఉమెన్స్ కాలేజీ (Koti Womens College) లో షూటింగ్‌ల సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, విద్యార్థినులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో చైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్వయంగా కాలేజీకి వచ్చి తనిఖీ చేశారు. విద్యార్థినులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే తమకు ఎలాంటి సమస్యలు లేవని, వేధింపుల సమస్య తమకు తెలియదని విద్యార్థినులు తెలపడం గమనార్హం. మెస్ ఇంచార్జి విషయంలో షీ టీమ్స్ కి వాయిస్ మెసేజ్ ఇచ్చింది ఎవరో కూడా తమకు తెలియదని స్టూడెంట్స్ చెప్పినట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలిపారు. వేధింపుల వార్తలను ప్రచారం చేసి తమ తల్లిదండ్రులు భయపడే విధంగా చేయొద్దని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే నిజంగా సమస్యలు ఉంటే నేరుగా ఉమెన్ కమిషన్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.
Read Also: స్పీకర్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్
Follow Us On: Youtube


