కలం వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగ మంచు (Thick Smog) కమ్మేసింది. నగర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతున్నాయి. ఇప్పటికే స్థానిక ప్రజలు వాయు కాలుష్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత(Delhi Air Quality) అత్యంత తక్కువ స్థాయికి పడిపోయినట్లు ఇటీవల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దట్టమైన పొగ మంచు వల్ల విమానాలు, ప్రయాణ కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పలు విమాన సర్వసులు రద్దీ, ఆలస్యం కానున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నా గాలి నాణ్యతను కొన్ని నెలల్లోనే పెద్దగా మార్చలేమని, దీర్ఘకాలికమైన చర్యలు అవసరమని భావిస్తోంది. పొగ మంచు తీవ్రత, గాలి కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Read Also: మూడో విడత పోలింగ్ ప్రారంభం
Follow Us On: X(Twitter)


