కలం, వెబ్ డెస్క్: అక్రమ వలసలను అడ్డుకొనేందుకు అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అనేక దేశాల మీద ట్రావెల్ బ్యాన్ (US Travel Ban) విధించిన అమెరికా .. తాజాగా మరో 20 దేశాల మీద నిషేధం విధించింది. ఇటీవల వైట్‌హౌస్‌కు సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బందిని ఆఫ్గనిస్తాన్(Afghanistan)కు చెందిన ఓ వ్యక్తి కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం అక్రమ వలసల అంశంపై మరింత ఉక్కుపాదం మోపాలని ట్రంప్(Donald Trump) ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశ భద్రతే లక్ష్యంగా ఈ ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఈ ఏడాది జూన్‌లోనే హైతీ, లిబియా, సోమాలియా, వెనిజువెలా, అఫ్గానిస్తాన్‌తో పాటు మొత్తం 12 దేశాల పౌరులపై అమెరికాలోకి ప్రవేశ నిషేధం (US Travel Ban) విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాను విస్తరిస్తూ బుర్కినో ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియా, పాలస్తీనా సహా మరికొన్ని దేశాలను చేర్చారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు కలిగిన వారిపైనా అమెరికా ప్రయాణ నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించింది.
ఇదే సమయంలో ఇప్పటికే పాక్షిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో మరో 15 దేశాలను చేర్చనున్నట్లు అమెరికా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వలసలు, శరణార్థుల(Refugees) ప్రవేశంపై అమెరికా వైఖరి మరింత కఠినంగా మారినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Read Also: ఈ ఏడాది ‘అలెక్సా’ని ఎక్కువగా అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్
Follow Us On: Instagram


