epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఈ ఏడాది ‘అలెక్సా’ని ఎక్కువగా అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్

కలం డెస్క్: గుడ్డును ఎంత సేపు ఉడకబెట్టాలి? ఇదేంటో అనుకునేరు.. 2025లో అమెజాన్ ఏఐ అలెక్సా(Alexa)ను చాలా తరుచుగా అడిగిన ప్రశ్నల్లో ఒకటి. అవాక్కవుతున్నారా? కానీ ఇదే నిజం. ఇది నేను చెప్పట్లేదు అమెజాన్(Amazon) అధికారికంగా ప్రకటించిన 2025లో ఇండియన్స్ అడిగిన ప్రశ్నల జాబితాలో ఉంది. ఇదొక్కటే కాదు.. ప్రపంచం ఎంత పెద్దది? అని కూడా చాలా మందే అడిగారు. ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి భారతీయులు గూగుల్‌ కన్నా ముందు అలెక్సా వైపు చూశారు. 2025 సంవత్సరంలో జనవరి నుంచి నవంబర్ వరకు భారతీయులు అలెక్సాను అత్యధికంగా అడిగిన ప్రశ్నల జాబితాను అమెజాన్ షేర్ చేసుకుంది. ఈ ప్రశ్నలు మన ఆసక్తులు, అలవాట్లు, సెలబ్రిటీ క్రేజ్‌కు అద్దం పట్టాయి.

అయితే ఈ ఏడాది అందరినీ నవ్వించిన ప్రశ్న మాత్రం ఒకటే. టెక్నాలజీ యుగంలోనూ అలెక్సా(Alexa)ను చాలా ఎక్కువ సార్లు అడిగిన ప్రశ్న “AI అంటే ఏమిటి?”. ఏఐ అంటే ఏంటి అని ఏఐనే అడిగిన మేధావులు అంటూ చాలా మంది నెటిజన్లు జోక్‌లు వేస్తున్నారు. ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలన్నట్లు.. ఏఐ వల్ల పోయిన జ్ఞానాన్ని అక్కడే వెతుక్కుంటున్నారని కూడా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇవే కాదు.. భారతీయులు ప్రపంచ ధనికులు, సెలబ్రిటీల నెట్‌వర్త్, హైట్ వంటి అంశాలను కూడా బాగానే సెర్చ్ చేశారు.

ఈ ఏడాది అలెక్సాకు వచ్చిన ఎక్కువ ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ, హింగ్లిష్ భాషల్లోనే నమోదయ్యాయి. ముఖ్యంగా బిజినెస్ దిగ్గజాల సంపదపై ఆసక్తి ఎక్కువగా కనిపించింది. ఎలాన్ మస్క్, ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ, జెఫ్ బెజోస్ నెట్ వర్త్ ఎంత? అన్న ప్రశ్నలు అలెక్సాను పదేపదే వినిపించాయి.

సెలబ్రిటీ మోజు కూడా ఏమాత్రం తగ్గలేదు. విరాట్ కోహ్లీ, రొనాల్డో, మెస్సీ నుంచి షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వరకూ— ఎత్తు ఎంత, భార్య ఎవరు, సంపద ఎంత వంటి ప్రశ్నలు అలెక్సాకు నిత్యకార్యక్రమంగా మారాయి.

సంగీతం విషయంలో భారతీయులు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ పాటలు ఎక్కువగా వినిపించగా, కే-పాప్ క్రేజ్ కూడా తగ్గలేదు. బీటీఎస్, జెన్నీ, బ్లాక్‌పింక్ పేర్లు అలెక్సా లిస్ట్‌లో నిలిచాయి. ఈ ఏడాది వైరల్ అయిన రోజ్–బ్రూనో మార్స్ ‘ఏపీటీ’ పాట టాప్ రిక్వెస్ట్‌లలో ఒకటిగా నిలవడం విశేషం.

పాడ్‌కాస్ట్ ప్రేమికులు కూడా అలెక్సాను వదలలేదు. ద రణ్‌వీర్ షో, ఫిన్‌షాట్స్ డైలీ, ద దేశీ క్రైమ్ పోడ్‌కాస్ట్, ద స్టోరీస్ ఆఫ్ మహాభారత, ద సద్గురు పోడ్‌కాస్ట్‌లను కూడా భారీగానే అడిగారు. రాజకీయాలు, జనాభా, భూగోళం వంటి అంశాలపై కూడా ప్రశ్నలు వచ్చాయి. భారత ప్రధాని ఎవరు? ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? అమెరికా అధ్యక్షుడు ఎవరు? అన్న ప్రశ్నలు తరచూ వినిపించాయి.

మొత్తానికి 2025లో అలెక్సా భారతీయుల ఇంట్లో ఒక వాయిస్ అసిస్టెంట్ మాత్రమే కాదు… మన కుతూహలాలకు, సెలబ్రిటీలపై ఇష్టానికి, సంగీత ప్రేమకు అద్దం పట్టిన డిజిటల్ ఫ్రెండ్‌గా నిలిచిందని అమెజాన్ చెబుతోంది.

Read Also: ఫ్లైట్‌ ఫుడ్ CEO బ్యాగ్‌లోకి.. సరాసరి ఎక్కడికి వెళ్తుందో తెలుసా?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>