epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫ్లైట్‌ ఫుడ్ CEO బ్యాగ్‌లోకి.. సరాసరి ఎక్కడికి వెళ్తుందో తెలుసా?

కలం, వెబ్ డెస్క్: విమాన ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్ ఆహారం ఇస్తుంటారు. కొందరు ఇష్టంగా తింటే, మరికొందరు రుచి చూసి వృథా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ ఇండియన్ సీఈవో అన్షు భారతీయ మంచి మెసేజ్‌ను షేర్ చేశారు. “విమానంలో నాకు భోజనం (Flight Food)  వడ్డించినప్పుడు ఎప్పుడూ తినని కొన్ని ఆహార పదార్థాలుంటాయి. పెరుగు, బన్స్, వెన్న, శాండ్‌విచ్. చాలామందిలాగే నేను వాటిని ట్రేలో తాకకుండా ఉంచేదాన్ని. కానీ అలా చేయడం ప్రతిసారీ నన్ను బాధపెట్టింది” అని ఆమె తెలిపింది. క్యాబిన్ సిబ్బందితో తనిఖీ చేసినప్పుడు తీసుకోని ఆహారం డస్ట్ బిన్‌లో పడేస్తారని తెలుసుకుంది.

ఆ తర్వాత విమానంలో ప్రయాణించిన ప్రతిసారి తినని ఆహార పదార్థాలు(Flight Food) సీల్ వేసుకొని బ్యాగ్‌లో వేసుకుంటానని చెప్పింది. ఈ అలవాటు మొదట్లో తనకు అసౌకర్యాన్ని కలిగించిందన్నారు. హ్యాండ్‌బ్యాగ్‌లో బన్స్ తీసుకెళ్లినందుకు తోటి ప్రయాణికులు నన్ను విమర్శిస్తారని భయపడేదాన్ని. ఇటీవల తోటి ప్రయాణికుడి సంభాషణ తనను పూర్తిగా మార్చిందని తెలిపారు. సీలు చేసిన ఆహారాన్ని అవసరంలో ఉన్నవారికి అందించాలని చెప్పింది.

బన్‌ను డస్ట్ బిన్‌లో వేసే బదులు ఇతరులకు ఇవ్వవచ్చునని, అందుకు విమాన సిబ్బంది కూడా చొరవ తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం అన్షు భారతీయ పోస్ట్ సోషల్ మీడియాలో (Social Medai) వైరల్‌గా ‌ మారింది. నెటిజన్లు తమ కామెంట్లతో స్పందించారు. “గొప్ప ఆలోచన కానీ ఇది సాధ్యపడకపోవచ్చు, ఆలోచన అద్భుతమైనది. కానీ దీన్ని పాటించాలంటే ధైర్యం కూడా ఉండాలి. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతా‘‘ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Read Also: SBI యోనో 2.0.. కొత్త ఫీచర్లు ఇవే

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>