కలం, వెబ్ డెస్క్ : వరంగల్ జిల్లా నర్సంపేటకు (Narsampet) చెందిన విశ్వబ్రాహ్మణ హస్తకళాకారుడు కొదురుపాక రాజేశ్వర్ రూపొందించిన భారీ టేకు చెక్క కలం అందరినీ ఆకట్టుకుంటోంది. 24 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఈ ప్రత్యేక కళాఖండాన్ని ఆయన శ్రమించి తయారు చేశారు. రూ.3 లక్షల వ్యయంతో సుమారు మూడు నెలల పాటు కష్టపడి ఈ టేకు చెక్క కలాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఈ కలాన్ని ఊరేగింపు నిర్వహించి ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానంసంపాదించాలనే లక్ష్యంతో ఈ కళాఖండాన్ని రూపొందించినట్లు రాజేశ్వర్ పేర్కొన్నారు. ఈ వినూత్న సృష్టి స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ భారీ కలం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: ‘చంద్రబాబుతో నా బంధం ఇదే’.. రాహుల్ ను ప్రధాని చేస్తా: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

