‘చంద్రబాబుతో నా బంధం ఇదే’.. రాహుల్ ను ప్రధాని చేస్తా: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : తన పాత రాజకీయ గురువు, ఏపీ సీఎం చంద్రబాబు పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆయన దగ్గర తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. తాను టీడీపీని వీడే సమయంలో చంద్రబాబుకు అబద్ధం చెప్పలేదన్న సీఎం.. తన గోల్ రీచ్ కావాలంటే పార్టీ మారాలని చెప్పి మరీ వచ్చానని పేర్కొన్నారు. ఇదే క్రమంలో దేశ రాజకీయాలపై స్పందిస్తూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. రాహుల్ ను ప్రధాని చేస్తామని తాము కూడా చెప్పామని, దానికోసం పని చేస్తామని పేర్కొన్నారు.

2034 వరకు సీఎంగా ఉంటాను..

తన జీవితంలో తాను అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించానన్న సీఎం రేవంత్ రెడ్డి.. . ZPTCగా కెరీర్ ప్రారంభించిన తాను అంచెలంచెలుగా ఎదిగానని గుర్తు చేశారు. తాను 2034 వరకు సీఎంగా పనిచేస్తానని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ 100 సీట్లు గెలిచినా.. తాను సీఎంగా ఉండనని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు కొందరు సినీ స్టార్స్ అనుకునే వారు కిడ్స్ నుంచి తనకు తెలుసు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దూల్ పెట్ లో గుడుంబా అమ్ముకునే వారి నుంచి దేశ ప్రముఖుల వరకు ఒకే రిలేషన్ మెయింటైన్ చేస్తా అన్నారు.

ప్రధాని మోదీకి ఆ విషయం చెప్పా..

మోదీ, బీజేపీ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగు వేసుకొని దక్షిణ భారత దేశాన్ని హత్య చేద్దామనుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ నియోజకవర్గ పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారత దేశానికి తీవ్ర నష్టమని పేర్కొన్నారు. ఆర్థికంగా చేయూతనిస్తున్న రాష్ట్రాలకు 50 శాతం, జనాభా ప్రకారం 50 శాతం చేయాలని మోదీకి చెప్పినట్లు వెల్లడించారు.

బీజేపీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

ఇటీవల జరిగిన హైదరాబాద్ సమావేశంలో తనతో కలిసి రావాలని ప్రధాని మోదీ వ్యాఖ్యనించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ పిలుపుతో తాను బీజేపీలో చేరబోతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దేశం, తెలంగాణ అభివృద్ధి విషయంలోనే కలిసి రావాలని మోదీ అన్నారన్న మోదీ.. తాము తెర వెనుక ఏం అనుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని కలిసి రావాలని అంటే తనకు డిమాండ్ ఉందని అనుకోవచ్చు కదా? అని వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>