అద్భుత సృష్టి.. 24 అడుగుల పొడవైన భారీ కలం

కలం, వెబ్ డెస్క్ : వరంగల్ (Warangal) జిల్లా నర్సంపేటకు (Narsampet) చెందిన విశ్వబ్రాహ్మణ హస్తకళాకారుడు కొదురుపాక రాజేశ్వర్ రూపొందించిన భారీ టేకు చెక్క కలం అందరినీ ఆకట్టుకుంటోంది. 24 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఈ ప్రత్యేక కళాఖండాన్ని ఆయన శ్రమించి తయారు చేశారు. రూ.3 లక్షల వ్యయంతో సుమారు మూడు నెలల పాటు కష్టపడి ఈ టేకు చెక్క కలాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఈ కలాన్ని ఊరేగింపు నిర్వహించి ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానంసంపాదించాలనే లక్ష్యంతో ఈ కళాఖండాన్ని రూపొందించినట్లు రాజేశ్వర్ పేర్కొన్నారు. ఈ వినూత్న సృష్టి స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ భారీ కలం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>