Mobile Popup Ad
Mobile Popup Ad

’వందేమాతరం‘పై బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) లో ఏర్పడిన నూతన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ గేయం వందేమాతరం (Vande Mataram) పాడడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, ప్రభుత్వ సహాయం పొందే ప్రతి పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయంలో వందేమాతరం గేయాన్ని తప్పకుండా ఆలపించాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలిచ్చింది.

కాగా, జాతీయ చిహ్నాలపై గౌరవానికి సంబంధించిన నిబంధనలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే బెంగాల్ ప్రభుత్వం జాతీయ గేయం ఆలాపనను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో బెంగాల్ లో కేవలం జాతీయ గీతం ’జన గణ మన..‘ ను మాత్రమే ఆలపించేవారు. సువేందు అధికారి (Suvendu Adhikari) నేతృత్వంలోని బీజేపీ అధికారం చేపట్టిన తరువాత వందేమాతరం (Vande Mataram) గేయం పై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Read Also: మాజీ సీఎం న్యూ గెటప్‌.. న్యాయవాది దుస్తుల్లో కోర్టుకు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>