కలం, వెబ్ డెస్క్ : సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వార్ కు తెరలేపింది. ఈ నేపథ్యంలో పలువురు ఆయన తీరు పట్ల మండిపడుతున్నారు. తాజాగా టీటీడీ మెంబర్, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఉదయనిధి సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సనాతన ధర్మాన్ని విమర్శించినందుకే స్టాలిన్ ఘోరంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.
నాతన ధర్మం జోలికి వస్తే ప్రజలు ఊరుకోరని భాను ప్రకాశ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఉదయనిధి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఉదయనిధి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే డీఎంకే పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Read Also: భగ్గుమంటోన్న ఇంధన ధరలు.. ఎయిరిండియా సంచలన నిర్ణయం
Follow Us On : WhatsApp

