Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్ కేసుపై కవిత రియాక్షన్.. బీఆర్ఎస్ తీరుపై ఘాటు వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: బండి భగీరథ్ కేసు వ్యవహారంపై కవిత (Kavitha) రియాక్ట్ అవుతూ.. బీఆర్ఎస్ పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియా అత్యుత్సాహంతో సదరు యువతి ఫోటోలను బహిర్గతం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఓ అమ్మాయి ఫోటోలను విడుదల చేశారు. ఆమె జీవితం నాశనం కావడానికి బీఆర్ఎస్ పార్టీనే బాధ్యత వహించాలని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ అతి ఉత్సాహం వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని కవిత ఆరోపించారు.

ఈ క్రమంలోనే నిందితుడు భగీరథ్ (Bandi Bhagirath) దేశం దాటి వెళ్లకుండా వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కవిత తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ చర్యతో విచారణ పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకాన్ని తెలంగాణ మహిళల్లో కలిగిస్తుందని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే వ్యవస్థపై గౌరవం పెరుగుతుందన్నారు. బాధితురాలికి న్యాయం చేకూరేలా పోలీసులు వ్యవహరించాలని కవిత డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>