కలం, వెబ్ డెస్క్ : మాజీ సీఎం జగన్ మెడికల్ కాలేజీలను పట్టించుకోలేదని.. ఆయన హయాంలో ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad). రేపల్లెలో 41 మందికి రూ.86 లక్షల విలువ చేసే సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు మంత్రి సత్యప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ టైమ్ లో రేపల్లెలో ఒక్క సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను కూడా అందజేయలేదని విమర్శించారు. కూటమి వచ్చాక రూ.10 కోట్ల సీఎంఆర్ ఎఫ్ చెక్కులను రేపల్లె నియోజకవర్గంలోనే అందజేసినట్టు వివరించారు మంత్రి.
‘జగన్(YS Jagan) ఇప్పుడు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాడు గానీ.. ఆయన టైమ్ లో ఒక్క మెడికల్ కాలేజీని కూడా కంప్లీట్ చేయలేదు. అప్పట్లో ఆయనకు రుషికొండ మీద ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజీల మీద లేకుండా పోయింది. జగన్ టైమ్ లో రాష్ట్రం పదేళ్లు వెనక్కు వెళ్లిపోయింది. కూటమి వచ్చాక ఇప్పుడు మళ్లీ అభివృద్ధి జరుగుతోంది. విశాఖ ఐటీ హబ్ గా మారుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తాం’ అంటూ తెలిపారు అనగాని సత్యప్రసాద్(Anagani Satya Prasad).
Read Also: IPL 2026 వేలంలో మెరిసిన కామెరూన్.. ఎంత ఖరీదంటే..!
Follow Us On: X(Twitter)


