కలం, వెబ్ డెస్క్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి(Ellareddy) మండలం సోమార్ పేట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్ తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజ్ తో పాటు అతని కుటుంబీకులు స్వరూప, పద్మ సత్తవ్వ, భారతి, బాలమణి తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారిని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న ట్రీట్ మెంట్ వివరాలను తెలుసుకున్నారు. ఇలాంటి హత్యారాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు కేటీఆర్ (KTR). నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
Read Also: బాండీ బీచ్ నిందితుడు హైదరాబాదీ!
Follow Us On: X(Twitter)


