కలం, వెబ్‌డెస్క్: సింగరేణి ఇన్చార్జి సీఎండీగా ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ (Krishna Bhaskar) నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎండీగా ఉన్న బలరాం డిప్యటేషన్ గడువు ముగియడంతో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కృష్ణభాస్కర్‌కు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర రెవెన్యూ సర్వీసుల నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన బలరాం.. సింగరేణిలో ఆరేళ్ల పాటు వేర్వేరు హోదాల్లో పనిచేశారు. సాధారణంగా డిప్యుటేషన్ ఐదేళ్లే ఉంటుంది. అయితే, మరో ఏడాది పాటు అదనంగా ఆయన సర్వీసును కేంద్రం పొడిగించింది. కాగా, కృష్ణభాస్కర్ ప్రస్తుతం తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీగా పనిచేస్తున్నారు.
Read Also: కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ కోవర్టులున్నారు : మైనంపల్లి హనుమంతరావు
Follow Us On: Instagram


