Mobile Popup Ad
Mobile Popup Ad

వెంకటాపురం మత్స్యగిరి గుట్ట చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ

కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలంలోని వెంకటాపురం పరిధిలోని మత్స్యగిరి గుట్ట (Matsyagiri Temple) లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకవర్గ నియామకానికి ఈనెల 11న నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 20 రోజుల్లోపు పాలకవర్గం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మత్స్యగిరి గుట్ట చైర్మన్ పదవి పదవిని ఇరువురు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సూచించినవారే మత్స్యగిరి గుట్ట చైర్మన్ అయ్యే అవకాశం ఉండడంతో ఉత్కంఠ నెలకొంది. మండల పరిషత్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మత్స్యగిరి గుట్ట చైర్మన్‌ ఎంపికపై ప్రాధాన్యం నెలకొంది.

మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి: మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి నరేశ్ రెడ్డి

మత్స్యగిరి గుట్ట (Matsyagiri Temple) చైర్మన్‌గా మరొసారి తనకు అవకాశం కల్పిస్తే స్వామివారి ఆశీస్సులతో గుట్టను మరింత అభివృద్ధి చేస్తానని మాజీ చైర్మన్ కుమార్ రెడ్డి నరేశ్ రెడ్డి అన్నారు. గతంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల సహకారంతో ఎన్నో అభివృద్ధి చేశానన్నారు. 20 ఏండ్లుగా మత్స్యగిరి గుట్ట కార్యక్రమాల్లో అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నానని, మరో అవకాశం కల్పించాలని కోరారు.

Read Also: పంట మార్పిడిపై రేవంత్ ద్వంద్వ విధానం: హరీశ్ రావు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>