కలం, వెబ్‌డెస్క్: తమిళనాడులో (Tamil Nadu) ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి (Edappadi Palaniswami) కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న పార్టీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని, వివిధ పార్టీల అభ్యర్థులు పోటీ చేసి విజేతలుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
పళనిస్వామి (Palaniswami) ఎక్స్ వేదికగా చేసిన ఈ పోస్టుతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాజా ఎన్నికల్లో దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళని స్వామి చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also : విజయ్, త్రిషల పెళ్లి చూడాలని ఉంది.. బాలీవుడ్ నటి కామెంట్స్
Follow Us On: WhatsApp

