కలం, వెబ్‌డెస్క్: రేపు సికింద్రాబాద్ (Secunderabad) పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బర్కత్‌పురలోని బీజేపీ సిటీ ఆఫీస్‌లో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) హాజరయ్యారు. మోడీ సభ విజయవంతానికి బీజేపీ భారీ ప్రణాళికలు రూపొందించారు. సమావేశానికి తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. మన ప్రియతమ ప్రధానికి అపూర్వ స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులన్నీ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. “దేశం కోసం మోడీ – మోడీ కోసం మనం” అనే నినాదంతో భారీ సమీకరణకు బీజేపీ కసరత్తు చేసింది. జనసమీకరణలో ప్రతి కార్యకర్త క్రియాశీలక భాగస్వామి కావాలని కిషన్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా మహిళలు, యువత, విద్యార్థులు ఈ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చేలా చూడాలని కోరారు.

