తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై పళనిస్వామి సంచ‌ల‌న పోస్ట్!

క‌లం, వెబ్‌డెస్క్‌: తమిళనాడులో ప్ర‌భుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న వేళ అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎడ‌ప్పాడి ప‌ళ‌ని స్వామి (Edappadi Palaniswami) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి, ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోతున్న పార్టీకి ఆయ‌న హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేశారు. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా ముగిసింద‌ని, వివిధ పార్టీల అభ్య‌ర్థులు పోటీ చేసి విజేత‌లుగా నిలిచార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప‌ళ‌నిస్వామి ఎక్స్ వేదిక‌గా చేసిన ఈ పోస్టుతో తాము ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం లేద‌ని ప‌రోక్షంగా స్ప‌ష్టం చేశారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో ద‌శాబ్దాలుగా సాగుతున్న‌ ద్ర‌విడ పార్టీల ఆధిప‌త్యానికి తెర‌దించుతూ న‌టుడు విజ‌య్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌ళ‌ని స్వామి చేసిన ఈ పోస్ట్ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>