epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బామ్మర్దిపై బావ పైచేయి

కలం డెస్క్ : బీఆర్ఎస్‌లో బావ (Harish Rao), బామ్మర్దుల (KTR) మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని ఒక సెక్షన్ ప్రజల్లో ఎప్పటి నుంచో జనరల్ టాక్. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) అయినప్పటికీ హరీశ్‌రావుకు ట్రబుల్ షూటర్ (Trouble Shooter) అనే పేరున్నది. వీరిద్దలో ఎవరిది పైచేయి అనే చర్చ కొద్దిమంది కేడర్‌లో వినిపిస్తూ ఉంటుంది. ఇద్దరికీ వారికంటూ ప్రత్యేకంగా వర్గాలు, ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన రెండు ఫేజ్‌ల స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) గెలిచిన సర్పంచ్ స్థానాలను ఆ పార్టీ శ్రేణులు పోల్చి చూసుకుంటున్నాయి. బావకు ఎక్కువ వచ్చాయా?.. లేక బామ్మర్దికి ఎక్కువ వచ్చాయా?.. అని చర్చించుకుంటున్నారు. గణాంకాలను పరిశీలిస్తే సిద్దిపేట (Siddipet) జిల్లాకు చెందిన బావ (హరీశ్‌రావు)కే ఎక్కువ సర్పంచ్ స్థానాలు దక్కాయి. సిరిసిల్ల (Sircilla) జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెడుతున్న బామ్మర్ది (కేటీఆర్)కు మాత్రం తక్కువ స్థానాలే వచ్చాయి.

హరీశ్‌కు 54%, కేటీఆర్‌కు 38% :

సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న హరీశ్‌రావు ఆ జిల్లాతో పాటు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాపై ఫోకస్ పెడుతూ ఉంటారు. పార్టీ యాక్టివిటీస్‌ను పర్యవేక్షిస్తూ ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లలో మొత్తం 345 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 185 చోట్ల ఆ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్‌కంటే 48 స్థానాలను ఎక్కువే గెలిపించుకున్నారు. మొత్తం సీట్లలో దాదాపు 54% చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో రెండు ఫేజ్‌లలో మొత్తం 173 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో బీఆర్ఎస్‌కు 66 మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ కంటే 21 సీట్లు తక్కువే వచ్చాయి. కేటీఆర్ విజయం 38% మాత్రమేనని లెక్కలు తేల్చాయి. సరిగ్గా ఈ గణాంకాలనే ఇప్పుడు బీఆర్ఎస్ కేడర్ పోల్చి చూసుకుంటున్నారు. బామ్మర్దికంటే బావకే ఎక్కువ సీట్లు దక్కాయనేది వారి భావన.

వీరిద్దరిలో ఎవరు సమర్ధులు? :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, హరీశ్‌రావు(Harish) గురించి పార్టీలో దీర్ఘకాలంగానే చర్చ జరుగుతూ ఉంది. కేడర్‌ను కలుపుకుపోవడంలో, పార్టీని పటిష్టంగా నిర్మించడంలో వీరిద్దరి పనితీరును శ్రేణులు విశ్లేషిస్తూ ఉంటాయి. మరోవైపు ఇద్దరూ గతంలో మంత్రులుగా పనిచేసినందున సబ్జెక్టులో కూడా ఎవరికి ఎక్కువ నాలెడ్జి ఉందనేది కూడా ఒక చర్చనీయాంశమే. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తాన్ని హరీశ్‌రావు శాసించగలరని ఆయన ఫాలోవర్లు గొప్పగా చెప్పుకుంటారు. ఇలాంటి చర్చలకు కొనసాగింపుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలవారీగా ఇద్దరి పర్‌ఫార్మెన్స్ గురించి కేడర్‌లో చర్చ మొదలైంది. కేటీఆర్‌కంటే హరీశ్‌రావే(Harish Rao) ఎక్కువ మంది సర్పంచ్‌లను గెలిపించుకున్నారని ఒకింత సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి పోలిక భవిష్యత్తులో పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది కొసమెరుపు.

Read Also: పిల్లల డైపర్లకు బదులుగా ఈ మ్యాట్.. రూపొందించిన విద్యార్థిని

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>