కలం, వెబ్ డెస్క్ : మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానంపై చంద్రబాబు (Chandrababu) కీలక కామెంట్స్ చేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమాన్ని విజయవాడ(Vijayawada)లో నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి కోసం ప్రాణాలు విడిచిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పొగిడారు. ఆయన ఆశయ సాధన కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. వైసీపీ పాలనలో కనీసం రాజధాని పేరు కూడా చెప్పుకోలేకపోయామన్నారు చంద్రబాబు నాయుడు. కేవలం పేర్ల ప్రకటన వరకే జగన్ పాలన సాగిందని విమర్శించారు. పీపీపీ విధానంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు.
‘పీపీపీ విధానం మంచిదే అని పార్లమెంటరీ కమిటీనే తేల్చి చెప్పింది. హాస్పిటళ్లు, స్కూళ్లు పీపీపీ విధానంలో ఉంటే ప్రభుత్వానికే పూర్తి హక్కు ఉంటుంది. ఇలాంటి విధానాలు చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. కానీ వైసీపీ నేతలు కావాలనే దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ల లాగా మూడు రాజధానులు అంటూ మేం హడావిడి చేయట్లేదు. మూడు రాజధానులు ఒక మహాకుట్ర. మేం అమరావతిని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం’ అంటూ తెలిపారు చంద్రబాబు నాయుడు(Chandrababu).
Read Also: ఎస్బీఐ ఎండీగా రవి రంజన్
Follow Us On: X(Twitter)


