Mobile Popup Ad
Mobile Popup Ad

నిర్మాత ఆర్బీ చౌదరికి నివాళులు అర్పించిన విజయ్

కలం, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ చౌదరి (RB Choudary) పార్థీవదేహాన్ని టీవీకే అధినేత విజయ్ (Vijay)  సందర్శించారు. చెన్నైలోని ఆర్బీ చౌదరి నివాసానికి వచ్చిన విజయ్.. పూలమాల వేసి నివాళులర్పించారు. భౌతికకాయం వద్ద కాసేపు విషాణ్ణ వదనంతో నిలబడి ఉండిపోయారు. అనంతరం, చౌదరి కుమారుడు, హీరో జీవాను పరామర్శించారు. విజయ్ ను చూడగానే.. జీవా ఒక్కసారిగా విలపించాడు. విజయ్–జీవా కలిసి స్నేహితుడు మూవీలో నటించిన విషయం తెలిసిందే.

ఆ మూడు సినిమాలు.. సూపర్ హిట్లు

ఆర్బీ చౌదరి మరణవార్త తెలియగానే విజయ్ (Vijay) దిగ్భ్రాంతికి గురయ్యారు. వీరిద్దరు కలయికలో మూడు సినిమాలు రాగా.. అవి సూపర్ హిట్స్ కొట్టడంతో పాటు విజయ్ కెరీర్‌కు ఎంతో బాగా ఉపయోగపడ్డాయి. పూవే ఉనక్కగ (1996), లవ్ టు డే (1997), తుల్లద మనుముం తుల్లుం (1999) సినిమాలు విజయ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. ఆర్బీ చౌదరి తమిళంతో పాటు తెలుగులోనూ అగ్ర హీరోలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు హిట్స్‌గా నిలిపారు.

Read Also: రేపు చెన్నైకి అమిత్ షా.. ప్రభుత్వ ఏర్పాటుపై కీలక నిర్ణయం?

Follow Us On: WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>