మంత్రి సీతక్క పరువు నష్టం దావా… బీఆర్ఎస్‌కు కోర్టు షాక్…!

కలం, వెబ్ డెస్క్ : అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంలో బీఆర్ఎస్ తనపై అసత్య ప్రచారం చేస్తుందని మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) (Minister Seethakka) దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుపై బుధవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా టెండర్ నోటిఫికేషన్ నుండి పేమెంట్ వివరాల వరకు అన్ని పత్రాలను పరిశీలించిన న్యాయస్థానం.. రూ. 30 కోట్ల అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చింది.

ప్రభుత్వం ఒక్కో మొబైల్ ఫోన్‌ను రూ. 11,650 చొప్పున మొత్తం రూ. 44.42 కోట్లతో కొనుగోలు చేయగా, రూ. 8,499 విలువైన ఫోన్‌ను రూ. 14,499కి కొన్నారని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మంత్రి పరువుకు నష్టం కలిగించే అన్ని రకాల పోస్టులను సోషల్ మీడియా నుంచి తక్షణమే తొలగించాలని బీఆర్ఎస్, అలాగే ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)లను ఆదేశిస్తూ తాత్కాలిక ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>