Mobile Popup Ad
Mobile Popup Ad

పదేళ్లలో.. లక్షల కోట్ల పేదల సొమ్ము లూటీ

కలం, ఖమ్మం బ్యూరో: కేసీఆర్ కుటుంబం గడిచిన పదేండ్లలో లక్షల కోట్ల పేదల సొమ్ము లూటీ చేసిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) ఆరోపించారు. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన ప్రజా దర్బార్‌లో ఆయన మాట్లాడారు.  తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్‌కు అధికారం ఇస్తే, లక్షల కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు.

దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని నిధులు బీఆర్ఎస్‌కు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏం ఒరగ బెట్టారని, ఆ పార్టీకి అన్ని విరాళాలు వచ్చాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడై ఉండి ఏ ఒక్క రోజు అసెంబ్లీకి రాకుండా, ప్రజల సమస్యలపై మాట్లాడకుండా, కేవలం అధికార దాహంతో మొసలి కన్నీరు కారుస్తున్నారనీ మంత్రి (Minister Ponguleti) ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు.

Read Also: నాడు చంద్రబాబును నిలదీసిన రైతు.. నేడు కేటీఆర్ పలకరింపు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>