కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. డీఎంకే–ఏఐడీఎంకే కూటమిగా ఏర్పడబోతున్నాయనే ఊహాగానాల నడుమ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) రేపు చెన్నైకి రానున్నట్లు సమాచారం. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికే షా రేపు మద్రాస్ వస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా.. ద్రవిడ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇరు పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కోర్టుకు వెళ్లే ఆలోచనలో టీవీకే..?
తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించని పక్షంలో గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లాలని టీవీకే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం కల్పించడమే నిబంధనల ప్రకారం సరైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ వద్దకు మరోసారి టీవీకే నేతలు వెళ్లే అవకాశం కూడా ఉందని సమాచారం.

