Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణకు ప్రధాని మోదీ.. ఇదే పూర్తి షెడ్యూల్!

కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) ఈ నెల 10న తెలంగాణకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదలైంది. మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగళూర్ కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:20 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 2.30 గంటలకు ఎయిర్ పోర్టు వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అక్కడి నుంచి 3.45 గంటలకు హైటెక్ సిటీకి చేరుకుంటారు. 4.15 గంటల వరకు సాయి సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కి చేరుకోనున్నారు. 6.30 గంటల వరకు అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం, 6.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి గుజరాత్ జామ్ నగర్‌కి వెళ్తారు.

మోదీ పర్యటనకు భారీ భద్రత..

మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ (PM Modi) మొదటిసారి తెలంగాణకు వస్తుండటంతో బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో, భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పాల్గొనే సమావేశాలు, పరిసర ప్రాంతాల్లో స్పెషల్ గ్రూప్ ప్రొటెక్షన్ అధికారులు నిఘా పెట్టారు. వీరికి తోడు రాష్ట్ర పోలీసులు సైతం భద్రతా విధుల్లో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై ఇప్పటికే సీఎస్, డీజీపీ సమీక్ష చేశారు.

Read Also: వియత్నాం అధ్యక్షుడితో మోదీ భేటీ.. కీలక చర్చలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>