వియత్నాం అధ్యక్షుడితో మోదీ భేటీ.. కీలక చర్చలు

కలం, నేషనల్ డెస్క్: ఇండియా, వియత్నాం దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు పెంచేలా వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) బుధవారం ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, వివిధ రంగాల సహకారాన్ని గణనీయంగా విస్తరించడంలో ఇది కీలక అడుగు అని తెలిపారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, వియత్నాం అధ్యక్షుడు తో లామ్ సమక్షంలో పలు ఎంవోయూలు కుదిరాయి. ఈ సందర్భంగా జాయింట్ ప్రెస్మీట్లో మోదీ మాట్లాడారు. ‘‘ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యం. ద్వైపాక్షిక భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఇరు దేశాల మధ్య కుదిరిన ఔషధ నియంత్రణ సంస్థల ఒప్పందంతో వియత్నాంలో ఇండియా మెడిసిన్స్ అన్ని చోట్ల దొరుకుతాయి. వియత్నాంకు వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల ఎగుమతి మరింత సులభతరం కానున్నది’’అని మోదీ పేర్కొన్నారు.

మన ద్రాక్ష, దానిమ్మ.. వియత్నాంకు..

వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలతో త్వరలో రెండు దేశాల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని మోదీ తెలిపారు. “త్వరలో వియత్నాం ప్రజలు.. ఇండియా ద్రాక్ష, దానిమ్మ పండ్ల రుచి చూస్తారు. మేము వియత్నాంకు చెందిన ‘పొమెలో’ (బొబ్బరి పండు వంటిది) రుచి చూస్తాం. ఇది మాత్రమే కాకుండా.. ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకేళ్లేందుకు నిర్ణయించాం. ఇది ఇండియా, అన్ని ఆసియాన్ దేశాల మధ్య వాణిజ్యానికి, పెట్టుబడులకు కొత్త ఊపునిస్తుంది” అని మోదీ పేర్కొన్నారు.

సప్లై చైన్పై ఫోకస్

భవిష్యత్ రంగాలపై దృష్టి సారిస్తూ.. సప్లై చైన్ స్టెబిలిటీ, మౌలిక సదుపాయాలపై రెండు దేశాల భాగస్వామ్యం ఫోకస్ పెడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘రేర్ ఎర్త్స్ ఎలిమెంట్స్, ఇంధన రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు ఇరు దేశాల ఆర్థిక భద్రత, సప్లై చైన్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కనెక్టివిటీ, కెపాసిటీ బిల్డింగ్ మా భాగస్వామ్యంలో మూల స్తంభాలు. రెండు దేశాల మధ్య విమానయాన సేవలు పెరుగుతుండటం చాలా సంతోషాన్నిస్తున్నది’’అని మోదీ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>