Mobile Popup Ad
Mobile Popup Ad

సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదల వాయిదా

కలం, వెబ్ డెస్క్ : సమంత లీడ్ రోల్ లో నటించిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) సినిమా విడుదల వాయిదా పడింది. మే 15న సినిమాను విడుదల చేస్తామని తొలుత చిత్ర యూనిట్ ప్రకటించగా.. తాజాగా సినిమాను వాయిదా వేస్తూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 19న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఐపీఎల్ సీజన్లో క్లాష్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

కాగా, నందిని రెడ్డి , సమంత కాంబినేషన్ లో రానున్న ఈ మాస్ యాక్షన్ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సమంత స్వయంగా తన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ మీద నిర్మిస్తోండడం విశేషం. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మే చివరి వరకు ఐపీఎల్ మ్యాచ్ లు ముగియనున్నాయి. ఈ క్రమంలోనే యువత అంతా మ్యాచ్ ల వైపు ఆకర్షితులవుతారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్ ల తర్వాతే సినిమాను రిలీజ్ చేద్దామని ‘మా ఇంటి బంగారం’ చిత్ర యూనిట్ తాజా నిర్ణయం తీసుకుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>