కలం, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 విడుదల రోజున జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బాలుడి కుటుంబాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind), అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ (Sritej) నివాసానికి వెళ్లిన వారు, ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ సోదరి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని, ఆమెను ఉన్నత చదువులు చదివిస్తానని హామీ ఇచ్చారు. కష్ట సమయంలో అల్లు కుటుంబం తమకు అండగా నిలవడం పట్ల శ్రీతేజ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Read Also: బాత్రూమ్స్ కడిగి, బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగి.. హ్యాట్సాఫ్ ప్రతీక్ష!
Follow Us On: WhatsApp

