epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అడుగుతారా?.. కడిగేస్తారా? నెటిజన్ల ముందుకు కవిత

కలం, వెబ్‌డెస్క్: జాగృతి అధ్యక్షురాలు కవిత నెటిజన్ల ముందుకు రాబోతున్నారు. ఆస్క్ కవిత (Ask Kavitha) కార్యక్రమంలో భాగంగా ఆమె నెటిజన్లతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో నెటిజన్లు కవితను ఏం అడగబోతున్నారు? కవిత ఏదైనా రాజకీయ ప్రకటన చేస్తారా? కొత్త పార్టీకి సంబంధించిన అంశమేదైనా రివీల్ చేస్తారా? అన్న ఆసక్తి నెలకొన్నది. కవిత ఫుల్ యాక్టివ్ అయ్యారు. ‘జనం బాట‘ పేరుతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే తేడా లేకుండా అందరిని కడిగిపారేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నేతలనే ఆమె టార్గెట్ చేస్తున్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితర నేతలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. కవిత మీడియా ముందుకొచ్చిందంటే ఏం బాంబు పేలుస్తుందోనని బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది.

ఆస్క్ కవితపై సర్వత్రా ఆసక్తి

కవిత చేయబోయే ఆరోపణల గురించి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు. కవిత కొత్తగా రాజకీయ పార్టీ పెడతారా? లేదంటే ఇంకేదైనా పార్టీలో చేరతారా? అన్న విషయంలో క్లారిటీ లేదు. తాను పార్టీ పెట్టబోతున్నానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినప్పటికీ .. నేరుగా ప్రకటన చేయలేదు. అయితే కవిత రాజకీయ భవిష్యత్ ఏమిటి? ఆమె ఏం చేయబోతున్నారు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం 6 గంటలకు కవిత ఆస్క్ కవిత పేరుతో (Ask Kavitha)  నెటిజన్లతో ఇంటరాక్ట్ అవబోతున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు ఏం ప్రశ్నలు అడుగుతారా? కవిత ఏం సమాధానాలు చెప్పబోతున్నది? అన్నది ఆసక్తి కరంగా మారింది. పార్టీ పెట్టే విషయం రివీల్ చేస్తారా? అసలు నెటిజన్లు ఆమె నుంచి ఏం ఆశిస్తున్నారు. కవితకు ప్రజల్లో నిజంగానే సానుభూతి ఉందా? బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన అనంతరం తొలిసారిగా ఆమె నెటిజన్ల ముందుకు రాబోతున్నారు? దీంతో ఆస్క్ కవిత (Ask Kavitha) కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

కవితకు సానుభూతి వ్యక్తమవుతోందా?

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అనంతరం తొలిసారిగా నెటిజన్ల ముందుకు రాబోతున్న జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఆసక్తి కేంద్రీకృతమైంది. ఇదే సమయంలో ప్రజల్లో కవితకు సానుభూతి వ్యక్తమవుతోందా? అనే అంశం కూడా చర్చకు వస్తోంది. పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత ఆమె తీసుకుంటున్న రాజకీయ వైఖరి, నేతలపై విమర్శల వెనుక ఉద్దేశ్యం ఏమిటన్నది నెటిజన్లు అడిగే ప్రధాన ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి.

ఏం ప్రశ్నలు అడగబోతున్నారు?

మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత కోరుతూ ప్రశ్నలు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు కవిత రాజకీయ లక్ష్యం ఏమిటి? కొత్త పార్టీ ఉంటే దాని విధానాలు ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఆమె కొత్తగా ఏ మార్పు తీసుకురావాలని భావిస్తున్నారన్న అంశాలపై నెటిజన్లు నిలదీయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.

బీఆర్ఎస్ మద్దతుదారులు లైవ్‌లోకి వస్తే..!

బీఆర్ఎస్ మద్దతుదారులు లైవ్‌లోకి వస్తే ప్రశ్నల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరడం, భవిష్యత్ రాజకీయ దిశపై స్పష్టత అడగడం వంటి ప్రశ్నలు ఆమెను ఎదుర్కొనే అవకాశముంది. మొత్తంగా చూస్తే, సస్పెన్షన్ అనంతరం కవితకు ఈ కార్యక్రమం కీలకంగా మారబోతున్నది. ఈ లైవ్ ఇంటరాక్షన్(Aks Kavitha) ఆమె రాజకీయ ప్రయాణానికి కీలక మలుపు అవుతుందా? లేక వివాదాలకు దారితీస్తుందా? అన్నది వేచి చూడాలి.

Read Also: వచ్చేశాయ్ AI జిమ్స్.. క్యాలరీలు కరిగించేద్దాం ఎంచక్కా!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>