కలం, వెబ్ డెస్క్: డిజిటల్ లైఫ్‌లో గ్యాడ్జెట్లు మనిషి దైనందిన జీవితంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. టెక్నాలజీని వాడుతూ చాలామంది తమ రోజువారి పనులను చక్కదిద్దుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నడుస్తుండటంతో వీటి ప్రభావం జిమ్స్‌లోనూ(AI Gyms) కనిపిస్తోంది. చాలా సెంటర్లు AIని వినియోగిస్తూ ఫిట్‌నెస్ పాఠాలు చెబుతున్నాయి. ఏఐతో త్వరగా బరువు తగ్గడం, ఎక్కువగా కష్టపడకుండా నాజుగా మారే అవకాశాలు ఉండటంతో ఫిట్‌నెస్ ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కృత్రిమ మేధస్సు ఆధునిక జిమ్ అనుభవాన్ని అందిస్తోంది. వయస్సు, శరీర బరువు, ఫిట్‌నెస్ లక్ష్యాలు, హృదయ స్పందన రేటు, కదలికలను ఎప్పటికప్పుడు వినియోగదారుడి డేటాను ఏఐ సేకరించి విశ్లేషిస్తాయి.
ఈజీగా బరువు తగ్గేలా గైడ్ చేస్తూ రొటీన్‌కు భిన్నంగా వర్కువుట్స్ చేసేలా మెలకువలు అందిస్తుంది. ఎవరైనా వర్కవుట్స్ తప్పుగా చేస్తే వెంటనే అలర్ట్ చేసి గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలా తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అందుకే దేశంలోని ప్రధాన జిమ్ సెంటర్లలో కోచ్‌లు ఏఐ టెక్నాలజీ (Technology)ని పరిచయం చేస్తూ ఫిట్ నెస్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది వ్యాయామాలకు దూరంగా ఉండిపోతున్నారు. జిమ్ చేసే టైం లేక బరువు పెరిగిపోతున్నారు. ‘వీకెండ్ వర్కవుట్స్’ లాంటి ట్రెండ్ ఫాలోఅవుతున్నా బరువు తగ్గడం లేదు. అలాంటి వారికి ఏఐ జిమ్స్ (AI Gyms) మరింత ఉపయోగపడతాయని అంటున్నారు కోచ్‌లు.
Read Also: బీ అలర్ట్.. పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా!
Follow Us On: Sharechat


