కలం డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను మ్యాచ్‌లలో గెలిపించే సత్తా ఉన్న ఆటగాల్లు సూర్య కుమార్, శుభ్‌మన్ గిల్ అని అన్నాడు అభిషేక్ శర్మ(Abhishek Sharma). వీరిద్దరూ ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. దాని వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వారికి అభిషేక్ మ్దతుగా నిలిచాడు. ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో అభిమానుల్లో అసహనం వ్యక్తమవుతోంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సూర్య, గిల్‌కు గట్టిగా మద్దతుగా నిలిచాడు. మూడో టీ20 మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన అభిషేక్ శర్మ(Abhishek Sharma), వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరూ టీమిండియాకు మ్యాచ్‌లు గెలిపించే కీలక పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
“నన్ను నమ్మండి. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav), శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు మ్యాచ్‌లు గెలిపిస్తారు. ప్రపంచకప్‌కు ముందు కూడా వారు కీలక ఇన్నింగ్స్‌లు ఆడతారు” అని అభిషేక్ పేర్కొన్నాడు. శుభ్‌మన్ గిల్‌తో తాను చాలా కాలంగా కలిసి ఆడుతున్నానని, అతడు ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పిచ్‌లపై రాణించగలడో తనకు బాగా తెలుసని చెప్పాడు. “శుభ్‌మన్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే అందరికీ అతడిపై అదే నమ్మకం కలుగుతుంది” అని అభిషేక్ స్పష్టం చేశాడు.
Read Also: వచ్చేశాయ్ AI జిమ్స్.. క్యాలరీలు కరిగించేద్దాం ఎంచక్కా!
Follow Us On: Sharechat


