కలం, వెబ్ డెస్క్: జీహెచ్ ఎంసీ (GHMC)లో డివిజన్ల పెంపు మీద కొత్త వివాదం మొదలైంది. డివిజన్ల పెంపు మీద వినయ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. ఈ పిటిషన్ మీద అత్యవసరంగా విచారణ జరిపించాలని కోరారు. దీంతో విజయ్ సేన్ రెడ్డితో కూడిన బెంచ్ విచారణకు అనుమతించింది. హైదరాబాద్ ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏక పక్షంగా జీహెచ్ ఎంసీ డివిజన్లను పెంచేసిందని పిటిషన్ లో తెలిపారు.
కమిటీ సభ్యుల సూచనలు తీసుకోవాలి : దానం
GHMC డివిజన్ల పెంపు మీద అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender). డివిజన్ల పెంపు మీద వేసిన కమిటీలోని సభ్యులు చాలా ప్రతిపాదనలు చేశారని వాటిని కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. డివిజన్ల పెంపు ద్వారా వచ్చే కొత్త సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు దానం.
Read Also: వాళ్లిద్దరూ వరల్డ్ కప్‌లో గెలిపిస్తారు: అభిషేక్
Follow Us On: Youtube


