రాయచోటిలో..
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి(Rayachoty)లో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను వైసీపీ శ్రేణులు విజయవాడకు తరలించాయి. రాయచోటిలో శివాలయం చెక్ పోస్టు నుంచి బంగ్లా సర్కిల్ వరకూ వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కొందరు కార్యకర్తలు రెచ్చిపోయారు. ‘గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు ఒక్కొక్కడిని రప్పా, రప్పా (Rappa Rappa Slogans) నరుకుతాం‘ అంటూ పోస్టర్లతో హంగామా చేశారు. అయితే వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పక్కకు పోయి ఈ రప్పా రప్పా పోస్టర్ల మీదనే చర్చ జరుగుతోంది.
జగన్ సమర్థన
వైసీపీ నేతలను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని.. తప్పుడు కేసులు పెడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా కార్యకర్తలు, నేతల్లో జోష్ నింపేందుకు ఇటువంటి పోస్టర్లు పెడుతున్నామని వైసీపీ నేతలు కొందరు సమర్థించుకుంటున్నారు. ఏకంగా అధినేత జగన్ సైతం సినిమా డైలాగ్ చెప్తే తప్పేంటి? అని గతంలో తన పార్టీ కార్యకర్తలను వెనకేసుకొచ్చారు. దీంతో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఈ రప్పా రప్పా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. మరి వైసీపీకి ఈ పోస్టర్లు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తాయా? లేదంటే ప్రజల్లో వైసీపీ అంటే చులకన భావం ఏర్పడుతుందా? అన్నది వేచి చూడాలి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు విధ్వంస పాలన చేశారని.. తమ పార్టీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. అప్పట్లో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉండేదని వారి ఆరోపణ. ఇప్పుడేమో జగన్ అనుచరులు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తున్నారు. ఇలా ఏపీ రాజకీయాలు నిత్యం కక్షలు, వ్యక్తిగత ఆరోపణలతో హాట్‌హాట్‌గా ఉంటాయి. మరి జగన్ పార్టీకి ఈ రప్పా రప్పా పోస్టర్లు ఎంతమేరకు మేలు చేస్తాయో వేచి చూడాలి.
Read Also: వచ్చేశాయ్ AI జిమ్స్.. క్యాలరీలు కరిగించేద్దాం ఎంచక్కా!
Follow Us On: Youtube


