కలం, వెబ్ డెస్క్: ఏపీలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైసీసీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు (YSRCP Protest) నిర్వహిస్తోంది. కోటి సంతకాల సేకరిస్తోంది. జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కోటి సంతకాలు సేకరించిన ప్రతులతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి కోటి సంతకాలను సేకరించి వాటి ప్రతులను వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఈ నెల 18న గవర్నర్కు అందజేయనున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళనల్లో పాల్గొనేందుకు శ్రీకాకుళం బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. రాజమండ్రి, గుంటూరు జిల్లాలో వైసీపీ ఆందోళనలు చేపడుతోంది.
మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి ఎంసీ విజయనంద రెడ్డి నేతృత్వంలో 150 కార్లు తో భారీ ర్యాలీ నిర్వహించారు.
కాగా ఈ నిరసన(YSRCP Protest) ప్రదర్శనలను టీడీపీ నేతలు డ్రామాగా కొట్టిపారేశాడు. రాష్ట్రంలో వైసీపీని ఎవరూ నమ్మడం లేదని.. అందుకే ఆ పార్టీ ఉనికిని కాపడుకొనేందుకు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Also: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదం
Follow Us On: X(Twitter)


