కలం, వెబ్ డెస్క్: రోజురోజుకూ ఢిల్లీ (Delhi)లో గాలి నాణ్యత పడిపోతోంది. దీంతో ఎటుచూసినా దట్టమైన పొగమంచు కమ్మేసింది. ముఖ్యంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. సోమవారం ఉదయం పొగ మంచు కారణంగా దాదాపు 40 విమానాలు రద్దయ్యాయి. పలు విమానాలు దారి మళ్లాయి. అలాగే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు చోట్లా ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఢిల్లీలో పొగమంచు కమ్మేడయంతో భారత వాతావరణ విభాగం (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ మాత్రమే నమోదవుతున్నాయని వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
గాలి నాణ్యత పడిపోవడంతో (AQI) 456 మార్క్‌ను దాటింది. దీంతో పలు ప్రాంతాల్లో కాలుష్య గాలిని పీల్చలేక జనాలు ఇబ్బందులు పడుతున్నారు. దగ్గు, జలుబు లాంటి లక్షణాలతో బాధపడుతున్నారు. పిల్లలు, పెద్దలు, గర్భిణులు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. 50 శాతం మంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అత్యవసర వాహనాలు మాత్రమే ఢిల్లీ(Delhi)లో రాకపోకలు కొనసాగిస్తున్నాయి. పలు నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. ఢిల్లీలో దట్టమైన పొగమంచు నెలకొనడంతో చివరకు సుప్రీంకోర్టు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: బెంగాల్‌లో ‘సర్’ చిచ్చు.. 58 లక్షల ఓట్లు గాయబ్
Follow Us On: Sharechat


