Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడులో హంగ్ వస్తే​.. కింగ్ మేకర్‌ అయ్యేదెవరు?

కలం, వెబ్​ డెస్క్​ : దక్షిణాది రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamil Nadu Election) ఫలితాలు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ పరిశీలిస్తే ఎవరూ ఊహించని విధంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 118 కాగా.. టీవీకే ప్రస్తుతం 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే 56 స్థానాల్లో, అధికార డీఎంకే 64 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే సూచనలు కనిపించకపోవడంతో తమిళనాడులో హంగ్ ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి విజయ్ (Vijay) అడుగులపైనే ఉంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల కోసం ఎవరితో జతకడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతుతో విజయ్ పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నాడీఎంకేతో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అటు బీజేపీ, అన్నాడీఎంకే కూటమి సైతం టీవీకేకు (TVK) మద్దతు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. హంగ్ పరిస్థితుల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించబోయే పార్టీ ఏదో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

Read Also: తారుమారైన ఐదు రాష్ట్రాల ఫలితాలు.. కేసీఆర్‌పై భారీగా ట్రోల్స్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>