Mobile Popup Ad
Mobile Popup Ad

రబాడా జట్టులో ఉండటం గిల్ అదృష్టం : అశ్విన్

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ (GT) వరుసగా మూడు విజయాలతో దూసుకుపోతోంది. మే 3న పంజాబ్ కింగ్స్‌పై సాధించిన గెలుపును విశ్లేషిస్తూ టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన యూట్యూబ్ ఛానల్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గుజరాత్ పేసర్ కగిసో రబాడా బౌలింగ్‌ను ఆయన ఆకాశానికెత్తేశారు. ప్రస్తుత సీజన్‌లో రబాడా ఫామ్‌ను చూస్తుంటే ఆయనకు ఏదో ఆధ్యాత్మిక శక్తి ఆవహించినట్లు కనిపిస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డారు.

రబాడా కేవలం వేగంగా బౌలింగ్ చేయడం లేదని, నిప్పులు చెరిగే బంతులను విసురుతున్నారని కొనియాడారు. రబాడా వేసిన బంతులకు పంజాబ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కనీసం ఎదురుతిరగలేక పక్కకు తప్పుకున్నాడని అశ్విన్ గుర్తుచేశారు. ఈ మ్యాచ్‌లో రబాడా 2/22 గణాంకాలతో పంజాబ్‌ను కట్టడి చేశారు. ప్రస్తుతం 16 వికెట్లతో ఆయన పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నారు.

కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) విజయవంతం కావడం వెనుక బౌలర్ల కృషి ఎంతో ఉందని అశ్విన్ విశ్లేషించారు. రబాడా, సిరాజ్, హోల్డర్, రషీద్ ఖాన్ వంటి మేటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు కెప్టెన్ పని సగం పూర్తయినట్లేనని ఆయన అన్నారు. బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే కెప్టెన్ తెలివైనవాడిగా కనిపిస్తారని, లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. రషీద్ ఖాన్ తన అత్యుత్తమ ఫామ్‌లో లేకపోయినా, గిల్ ఆయనను డెత్ ఓవర్లలో చాకచక్యంగా వాడుకుంటున్నారని అశ్విన్ (Ravichandran Ashwin) మెచ్చుకున్నారు.

కేవలం రబాడా మాత్రమే కాకుండా, 4 వికెట్లు తీసిన జైసన్ హోల్డర్ ప్రదర్శనను కూడా అశ్విన్ ప్రశంసించారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్‌ను (Shreyas Iyer) సైతం హోల్డర్ ముప్పుతిప్పలు పెట్టి అవుట్ చేశారని ఆయన పేర్కొన్నారు. హోల్డర్ 4/24 స్పెల్‌తో గుజరాత్ విజయాన్ని సులభతరం చేశారని చెప్పారు. వరుస విజయాలతో ఊపుమీదున్న గుజరాత్ టైటాన్స్, మే 9న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గుజరాత్ ఈ జోరును ఇలాగే కొనసాగించాల్సి ఉంటుంది.

Read Also: తమిళనాడు ఫలితాలపై విజయ్​ తండ్రి ఏమన్నాడంటే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>