కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా చౌటకూరు మండలం శివంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. PACS సెంటర్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ.. వరి కోతలు పూర్తయి 15 రోజులు కావస్తున్న ఇంకా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడం కోసం రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు. రైతులు రోడ్ల పైనే వడ్లను ఆరబెట్టుకొని ఇబ్బంది పడుతున్నారని, జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకొని కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు.
Read Also: తమిళనాడులో హంగ్ వస్తే.. కింగ్ మేకర్‌గా విజయ్?
Follow Us On: Instagram

