Mobile Popup Ad
Mobile Popup Ad

టీవీకే చీఫ్ విజయ్ ఇంటికి నటి త్రిష..!

కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో తీవ్ర పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని రీతిలో టీవీకే పార్టీ తమిళనాడు ఫలితాల్లో దూసుకుపోతోంది. అధికార డీఎంకేను వెనక్కి నెట్టి విజిల్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. టీవీకే పార్టీ అధికారం చేపట్టబోతుందనే అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నటి త్రిష (Trisha) విజయ్ (Vijay) ఇంటికి చేరుకున్నారు.

ఆమె పుట్టిన రోజుతో పాటు ఫలితాలు ఒకే రోజు కావడంతో త్రిష (Trisha) తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి నుంచి నేరుగా విజయ్ (Vijay) ఇంటికి వెళ్లారు. అంతకుముందే విజయ్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు విజయ్ అభిమానులతో పాటు, టీవీకే కార్యకర్తలు దళపతి ఇంటివద్దకు భారీగా చేరుకుంటున్నారు.

Read Also: తారుమారైన ఐదు రాష్ట్రాల ఫలితాలు.. కేసీఆర్‌పై భారీగా ట్రోల్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>