కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌షా(Amit Shah) వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆర్ఎస్ఎస్ బెటాలియన్ మొత్తం దిగినా తమిళనాడును ఎన్నికలను ప్రభావితం చేయలేరని, బీజేపీని ఓడించడం డీఎంకే సాధ్యమవుతుందని అన్నారు. డీఎంకే యువజన విభాగం (నార్త్ జోన్) కార్యకర్తల సమావేశంలో బీజేపీనుద్దేశించి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా పార్టీ యువజన విభాగం అభివృద్ధి వెనుక నాయకుల కృషి ఉందన్నారు. 2024లో బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత అనుబంధ సంస్థలు దూకుడుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.
“కేవలం తమిళనాడు తమిళ భాషను కాపాడుకోవడానికి పరిమితం కాదు. మొత్తం దేశవ్యాప్తంగా బహుళత్వాన్ని కాపాడుతుంది. భారతదేశంలో బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా సైద్ధాంతికంగా పోరాడుతున్న ఏకైక రాష్ట్ర పార్టీ డీఎంకే. అందుకే బీజేపీ తమిళనాడులో విజయం సాధించలేకపోయింది” అని సీఎం అన్నారు. జాతీయ పార్టీలను మమ్మల్ని గౌరవిస్తే.. మేం జాతీయ పార్టీలను గౌరవిస్తామని స్టాలిన్(Stalin) చురకలంటించారు. ఏ రాష్ట్రంలోనైనా బీజేపి గెలవచ్చు. డీఎంకే ఉన్నంతవరకు తమిళనాడులో బీజేపీ ఆటలు సాగవని స్టాలిన్ కౌంట్ ఇచ్చారు.
Read Also: బెంగాల్‌లో ‘సర్’ చిచ్చు.. 58 లక్షల ఓట్లు గాయబ్
Follow Us On: Sharechat


