కలం, వెబ్ డెస్క్ : ఫ్లైట్ గాల్లో ఉండగానే ఓ మహిళకు గుండెపోటు వచ్చింది. అదే ఫ్లైట్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే సీపీఆర్ చేసి కాపాడిన ఘటన ఇండిగో విమానంలో జరిగింది. శనివారం మధ్యాహ్నం గోవా నుంచి ఢిల్లీకి ఇండిగో ఫ్లైట్(Indigo Flight) బయలుదేరింది. కొద్ది సేపటికే కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే మహిళ కుప్పకూలిపోయింది. అదే ఫ్లైట్ లో ఉన్న కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ (Anjali Nimbalkar) అలర్ట్ అయింది. జెన్నీకి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. జెన్నీకి స్పృహ వచ్చాక ఢిల్లీలో ల్యాండ్ అయ్యేదాకా అంజలి దగ్గరుండి చూసుకుంది. విమానం దిగిన వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది జెన్నీని హాస్పిటల్ కు తరలించారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) స్పందించారు. అంజలి(Anjali Nimbalkar) చేసిన పనిని ప్రశంసించారు. పదవి లేకపోయినా ప్రజాసేవలో ముందున్నందుకు అభినందిస్తూ.. అందరూ ఇలా స్పందించాలని కోరారు. అంజలిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
Read Also: లెక్కల పాఠం చెప్పిన ‘బండి’
Follow Us On: Instagram


