epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాహుల్‌తో కలిసి ఢిల్లీకి సీఎం రేవంత్

కలం డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi), ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఒకే ఫ్లైట్‌లో కలిసి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో (Ramlila Maidan) పార్టీ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళ్ళారు. ‘సర్’ (SIR) వివిధ రాష్రాల్లో అర్హులైన ఓటర్ల పేరుల గల్లంతవుతున్నాయని, బోగస్ ఓట్లు వచ్చి చేరుతున్నాయని, బీజేపీ తనకు అనుకూలంగా ఉండేలా ఎన్నికల సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నదని గత కొంతకాలంగా రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా కొన్ని ఆధారాలను కూడా మీడియా సమావేశాల్లో ప్రదర్శించారు. బీజేపీ, కేంద్ర ఎన్నికల కమిషన్ వైఖరికి నిరసనగా ఓట్ చోరీ (Vote Chori Protest) మహా ర్యాలీని కాంగ్రెస్ నిర్వహిస్తున్నది.

పలు రాష్ట్రాల నుంచి పార్టీ నేతలు :

సీఎంఓ కార్యాలయం తొలుత రూపొందించిన షెడ్యూలు ప్రకారం ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళ్ళాల్సి ఉన్నది. కానీ మెస్సీ (Messi) ఫుట్‌బాల్  మ్యాచ్‌ను తిలకించేందుకు స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ రావడంతో తిరుగు ప్రయాణంలో రేవంత్‌రెడ్డితో కలిసి వెళ్ళారు. వీరిద్దరూ కలిసి వెళ్ళడం రాష్ట్ర రాజకీయాల్లో మాత్రమే కాక కాంగ్రెస్ పార్టీలోనూ సరికొత్త చర్చకు దారితీసింది. రాహుల్‌గాంధీకి రేవంత్‌రెడ్డి పట్ల మంచి అభిప్రాయం లేదని, అందువల్లనే అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదంటూ బీఆర్ఎస్ ఇంతకాలం విమర్శలు చేసింది. అదే సమయంలో ఇద్దరూ కలిసి రెండు గంటల పాటు ఫ్లైట్‌లో ఏమేం మాట్లాడుకుంటారో అనే గుసగుసలు పార్టీ నేతల్లో వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ మొదలు అనేక అంశాల్లో రానున్న రోజుల్లో రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి ఏఐసీసీ ఫుల్ పవర్ ఇస్తుందేమో అనేది ఆ గుసగుసల సారాంశం.

Read Also: రేవంత్​ మనవడితో మెస్సీ ఫుట్​ బాల్​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>