epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మెస్సీని ఓడించిన రేవంత్

కలం, వెబ్​ డెస్క్​ : అర్జెంటీనా ఫుట్​ బాల్​ దిగ్గజం లియెనల్మెస్సీ (Lionel Messi) రాకతో ఉప్పల్​ స్టేడియం ఒక్కసారి దద్దరిల్లిపోయింది. ఫ్రెండ్లీ మ్యాచ్​ లో సింగరేణి ఆర్​ఆర్​ టీమ్ (Singareni RR Team), అపర్ణ జట్లు (Aparna Team) పాల్గొన్నాయి. సింగరేణి ఆర్​ఆర్​ జట్టు తరఫున సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బరిలోకి దిగగా.. అపర్ణ జట్టులో మెస్సీ ఆడాడు. అపర్ణ టీమ్ ముందు గోల్​ కొట్టగా.. తరువాత సీఎం రేవంత్​ రెడ్డి గోల్​ చేశాడు. ఫ్రెండ్లీ మ్యాచ్​ లో మెస్సీ టీమ్ రెండు గోల్స్​ కొట్టింది. సీఎం రేవంత్​ ఒక గోల్​ చేశాడు. కొద్దిసేపు ఇద్దరు కలిసి గేమ్​ ఆడారు. అనంతరం ఇరు జట్లు పెనాల్టీ షూటింగ్ లో పాల్గొన్నాయి.

సీఎం రేవంత్​ పెనాల్టీ షూటింగ్ లో గోల్​ కొట్టగా.. మెస్సీ (Lionel Messi) చప్పట్లు కొట్టి అభినందించాడు. ఆట​ పూర్తయిన తరువాత ఇరు జట్లతో ఫొటోలు దిగారు. నాలుగు జూనియర్​ టీమ్స్​ కు మెస్సీ టిప్స్​ ఇచ్చాడు. ఇందులో తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. అనంతరం మెస్సీ, రేవంత్​ స్టేడియంలో కలియ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. మ్యాచ్​ లో గెలుపొందిన సింగరేణి ఆర్​ఆర్​ టీమ్​ కు మెస్సీ కప్​ అందజేశారు. ఈ మ్యాచ్​ ను చూసేందుకు హాజరైన కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) జట్లతో కలిసి ఫోటో దిగారు.

Read Also: బీ అలర్ట్.. పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>