కలం, వెబ్ డెస్క్ : నిండ్ర ఎంపీపీ ఎన్నికపై వైసీపీ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్, టీడీపీ నేత చక్రపాణి రెడ్డి (Chakrapani Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రోజా (Roja) రాజకీయ జీవితం తమ భిక్ష అని చెప్పారు. ’రోజాకు నేనే బీ ఫామ్ ఇప్పించాను. కావాలంటే జగన్ ను అడగమనండి. ఆమె నా ఇంటికి వచ్చి అభ్యర్థిస్తే డ్రాప్ అయ్యాను‘ అని చక్రపాణి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నిండ్ర ఎంపీపీ ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయని, కానీ, రోజా చేసిన వ్యాఖ్యలు చాలా బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దయ వల్లే ఆమె ఎమ్మెల్యేగా గెలిచిందని చక్రపాణి రెడ్డి తెలిపారు. నగరి నియోజకవర్గంలో రోజా కుటుంబం విచ్చలవిడిగా దోచుకున్నది కీలక ఆరోపణలు చేశారు.
కాగా, నగరి నియోజకవర్గంలోని నిండ్ర ఎంపీపీ ఎన్నికల్లో టెక్నికల్ గా వైసీపీ అభ్యర్థులు గెలిస్తే టీడీపీ గెలించిందని.. టీడీపీ వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పుణ్యమా అని నగరిలో తాను సీటు ఇచ్చి గెలిపిస్తే తనకే వెన్నుపోటు పొడిచారని చక్రపాణి రెడ్డి పై రోజా తీవ్ర వివర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన చక్రపాణి రెడ్డి (Chakrapani Reddy) నగరి చరిత్రలోనే అత్యంత దారుణంగా ఓడిపోయినందుకే రోజా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని చక్రపాణి రెడ్డి హెచ్చరించారు.
Read Also: మెస్సీ పక్కన రాహుల్, రేవంత్ ప్లేస్ డిసైడ్ చేసేదెవరు?
Follow Us On: Instagram


