epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాత్రి 7.50కి ఉప్పల్​ స్టేడియంకు మెస్సీ

కలం, వెబ్​ డెస్క్​ : ఫుట్​ బాల్​ దిగ్గజం లియెనల్మెస్సీ (Lionel Messi) హైదరాబాద్​ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉప్పల్​ స్టీడియంలో నిర్వహించే ఫ్రెండ్లీ మ్యాచ్​ కు సంబంధించిన షెడ్యూల్​ బయటకు వచ్చింది. రాత్రి 7.50 నిమిషాలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​ కు మెస్సీ తో పాటు సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy), రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ఉప్పల్​ స్టేడియంకి వస్తారు. 8.06 నిమిషాలకు రేవంత్​ రెడ్డి, 8.07కు మెస్సీ గ్రౌండ్​ లోకి ఎంట్రీ ఇస్తారు. 8.18 కి మైదానంలోకి రాహుల్​ గాంధీ వస్తారు. మ్యాచ్​ పూర్తైన తరువాత టీమ్​ సభ్యులతో ఫోటో దిగుతారు.

అనంతరం చిన్నారులతో టికిటాక్​ కార్యక్రమం ఉంటుంది. 8.51 కి గెలిచిన టీమ్​కు మెస్సీ  ’గోట్​ కప్‘​ అందజేస్తారు. 8.54కి సీఎం రేవంత్ రెడ్డి.. లియోనల్మెస్సీని సన్మానించి బహుమతి ప్రజెంట్​ చేస్తారు. ఉప్పల్​ స్టేడియంలోని కార్యమ్రం 9.10 నిమిషాలకు ముగుస్తుంది. కాగా, మెస్సీ(Lionel Messi) కల్​ కతా పర్యటనలో చెలరేగిన ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్​ పోలీసులు అలెర్ట్​ అయ్యారు. ఉప్పల్​ స్టేడియంతో పాటు మెస్సీ పర్యటించే చోట్ల కఠిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం వద్ద 3000 మంది పోలీసులతో సెక్యూరిటీ పటిష్టం చేశారు.

Read Also: మెస్సీ టూర్​ ఏర్పాట్లపై గవర్నర్​ ఫైర్​​.. ఈవెంట్​ ఆర్గనైజర్​ అరెస్ట్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>