కలం, వెబ్‌డెస్క్: కేంద్ర క్యాబినెట్(Union Cabinet) శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిదినాలకు 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఇంకా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) మీడియాకు వెల్లడించారు. జనగణనకు కేంద్ర ప్రభుత్వం రూ.11,718 కోట్ల బడ్జెట్ కేటాయించింది. బొగ్గు గనుల్లో సంస్కరణలకు కేంద్రం(Union Cabinet) ఆమోదం తెలిపింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGA) పేరును పూజ్యబాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరును మార్చారు. భారత్ ఒమన్ ఫ్రీ ట్రేడ్‌కు అగ్రిమెంట్‌కు ఒప్పందం కుదిరింది.
Read Also: ఫుట్‌బాల్ దిగ్గజానికి అరుదైన గౌరవం.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం
Follow Us On: Youtube


