epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కొరకరాని కొయ్యగా కవిత.. గులాబీ నేతల్లో గుబులు!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) కొరకరాని కొయ్యగా మారారా? ఆమె దూకుడు చర్యలతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకుందా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కవిత జనం బాట పట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు జాగృతి ‘జనం బాట’ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలిగా కవిత ఆయా జిల్లాలో విస్త్రృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. స్థానిక సమస్యలపై గళం విప్పుతూ తప్పు చేసిన నేతలపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు కవిత టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలియక తలలు పట్టుకుంటారు. ఒకవైపు కేసీఆర్ కూతురు కావడం, మరోవైపు మహిళ కావడంతో బీఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో తోచడం లేదు. కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తుందే తప్పా, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

బీఆర్ఎస్‌ నేతలకు టెన్సన్

‘నేను కేసీఆర్‌ (KCR)కు లేఖలు రాయడం కొత్తేమీ కాదు. ఆయనకు తరచుగా సమాచారం (ఫీడ్‌ బ్యాక్‌) ఇస్తాను’ అని గతంలో కవిత తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. వరంగల్‌ సభ తర్వాత కూడా కేసీఆర్ స్పీచ్‌పై కవిత లేఖ, ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఘాటుగా బదులిచ్చారు. ‘కేసీఆర్‌ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. ఇక సామాన్యుల సంగతేంటి?’’అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని, హరీశ్ రావు, సంతోష్ రావుపై బహిరంగంగానే విమర్శించింది. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై ఘాటుగానే స్పందించి. ఆయన వల్లే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాశనమైందన్నారు. ఆ తర్వాత జనంబాటలో భాగంగా పలువురి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కవిత ఆరోపణలు చేసింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకావడంతో ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తినిరేపింది. ఇటీవల కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరంపై కవిత విరుచుకుపడ్డారు. ‘నీ భర్తకు హైదరాబాద్‌లో ఆస్తులు ఎక్కడివని, బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారు’ అనే ఆరోపణలకు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కృష్ణారావు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్ బయపడిందని, ఆయన చేసిన అన్ని ఆరోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తా అని కవిత తేల్చి చెప్పారు. ఇలా వరుస పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది.

కౌంటర్లతోనే కాలయాపన

ఎమ్మెల్యే కవిత(Kavitha) విమర్శలు, ఆరోపణలకు దిగడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేస్తున్నవారిని విడిచిపెట్టడం లేదు. టీన్యూస్‌తోపాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ (BRS) కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కూడా నోటీసులు ఇచ్చి షాక్‌కు గురిచేసింది. కవితో ఎన్నో ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించడం, తమ అధినేత బిడ్డ కావడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు డైలమాలో పడిపోతున్నారు. ఆమె ఆరోపణలకు కౌంటర్లు ఇస్తున్నారే తప్ప పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోకపోవడం లేదనే చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి చెందడం, పంచాయతీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వకపోడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్.

Read Also: మా పైసలు ఇచ్చేయండి.. ఓడిన అభ్యర్థుల డిమాండ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>